mohamed muizzu: ద్వైపాక్షిక చర్చలలో భాగంగా మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు తొలిసారి భారత్ పర్యటన కోసం వచ్చారు. మొయిజ్జు తన సతీమణి సాజిదా మహమ్మద్ తో కలిసి భారత్ పర్యటన కు వచ్చారు. ఈ పర్యటన 4 రోజుల పాటు జరిగ నుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాని నరేంద్ర మోడి తో భేటీ అవుతారు.
IRAN-ISRAEL WAR:ఇరాన్ పై దాడులు జరిగే అవకాసం… ప్రత్యామ్నాయం ఆలోచించాలన్న బైడెన్
మహమ్మద్ మొయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ద్వైపాక్షిక చర్చల కోసం భారత్ రావడం ఇదే తొలిసారి .
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు మధ్య ద్వైపాక్షి క చర్చలు, భారత్ – మాల్దీవుల మధ్య స్నేహ సంబంధాలు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది అని భారత విదేశాంగ మంత్రి S. జైశంకర్ తెలిపారు. ఆదివారం మోయిజ్జు తో భేటీ అయ్యారు, అందుకు సంంధించిన ఫోటోలను ” ఎక్స్” లో షేర్ చేశారు.
సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ తో జరపనున్న చర్చలతో ఇరుదేశాల మధ్య సత్సంబధాలు కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయనే విశ్వాసం ఉందని ఆయన తెలిపారు.
మొయిజ్జు అక్టోబర్ 6 నుంచి 10 వరకు ధ్వైపాక్షి చర్చల కోసం భారత్ లో పర్యటించనున్నారు. ఇరుదేశాలమధ్య దౌత్య విభేదాల తర్వాత మహమ్మద్ మొయిజ్జు భారత్ పర్యటన చేయటం ఇది రెండవ సారి.
One thought on “Mohamed muizzu: ద్వైపాక్షిక చర్చల కోసం భారత్ చేరుకున్న మొహమ్మద్ ముయిజ్జు”